నాదర్గుల్ గ్రామంలో మత్స్య కార్ల నూతన కమిటీ

Published: Wednesday February 24, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; నాదర్గుల్ గ్రామంలో  మత్స్య శాఖ సహకార సంఘం లో నూతన కమిటీ నిర్వహించారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో మంగళవారం నాడు మత్స్య శాఖ సహకార సంఘం లో ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారి ఎ. డి రమేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మత్స్య సహకార సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నాదర్గుల్ మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షులు బోయిని స్వామి ముదిరాజ్, ఉపాధ్యక్షులు తిరుపతి లింగమయ్య ముద్రాజ్, కార్యదర్శి తిరుపతి బాబయ్య ముద్రాజ్, తో పాటు సంఘం సభ్యులు బొద్ర మో ని శ్రీరాములు ముద్రాజ్, మోత కానీ శ్రీధర్ ముదిరాజ్, తిరుపతి విద్యాపతి ముదిరాజ్, బోయిని జగన్ ముదిరాజ్, మంత్రి మహేష్ ముదిరాజ్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.