గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలి

Published: Thursday June 24, 2021
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
వికారాబాద్, జూన్ 23, ప్రజాపాలన బ్యూరో : పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గ్రామాలన్నింటిని సర్వతోముఖాభివృద్ధి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సర్పంచులకు సూచించారు. బుధవారం జిల్లా పరిధిలో గల వికారాబాద్ మండలానికి చెందిన రాళ్ల చిట్టెంపల్లి, పీలారం, మైలార్ దేవరంపల్లి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను డిఎల్పిఓ అనిత, ఎంపిడిఓ సుభాషిణి, ఎంపిఓ నాగరాజులతో కలిసి గ్రామాల సర్పంచులు ముఫ్లయ యాస్మిన్ బేగమ్ గౌస్, కొంపల్లి భారతమ్మ నర్సిములు, ఆలంపల్లి తిరుపతి రెడ్డి ల ఆధ్వర్యంలో ప‌ల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడవ విడత హరిత హారానికి మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. నర్సరీలలో కలుపు మొక్కలను వెంట వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. ఖాలీ బెడ్లలో తొందరగా పెరిగే విత్తనాలు వేయాలని చెప్పారు. నర్సరీర చుట్టు పచ్చని తీగ పందిరి మొక్కలను నాటి సంరంక్షించాలని తెలిపారు. వైకుంఠ ధామాల నిర్మాణంలో వేగం పెంచిలని సూచించారు. ప్రకృతి వనంలో పెద్ద మొక్కల్ని మాత్రమే నాటి వాటికి సపోర్టుగా పొడవైన కట్టెలను నాటాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పనులు వెంట వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సుప్రియ, స్వాతి, అశోక్, గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.