జంతువుల వేటకు విద్యుత్ తీగలు అమర్చటం నేరం ** జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ **

Published: Thursday December 29, 2022
జిల్లా వ్యాప్తంగా 10 మంది పై కేసు నమోదు **
 
అసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 28(ప్రజాపాలన, ప్రతినిధి) : 
వేటగాళ్ళు పంట పొలాల్లో  విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ సందర్భంగా 
వన్య ప్రాణుల కోసం వేటగాళ్ళు పంట పొలాల్లో, లేదా అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  దొంగతనంగా విద్యుత్ తీగలు అమర్చడం వలన అవి  జంతువుల, మనుషుల ప్రమాదాలకు దారితీస్తున్నయని,ఇలా విద్యుత్ వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వస్తె అలాంటి వారిపై ఐపిసి సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్, నాన్ బెయిలబుల్ కేసులు,పీడీ యాక్టు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వారంలో 10 మంది పై కేసులు నమోదయాయని అన్నారు.