మనందరం నేలతల్లిని కాపాడుకోవాలి * చేవెళ్ల డిసెంబర్ 5, ప్రజాపాలన):-

Published: Tuesday December 06, 2022

భూమి సారవంతంగా ఉంటేనే  పంటలు బాగా పండుతాయి అని మనందరం నెల తల్లిని కాపాడుకోవాలని.  ప్రపంచ మృతిక నెల) దినోత్సవం  పురస్కరించుకొని  సోమవారం   చేవెళ్ల మండల కేంద్రంలోని  రైతు వేదిక ఆవరణంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో  ఎమ్మెల్యే కాల యాదయ్య మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం పంటకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఐదువేల  రూపాయలు
అందజేస్తుందని, రైతు బీమా పథకం, గిట్టుబాటు ధర, విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తుందని అన్నారు.     ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వంగేటి  లక్ష్మారెడ్డి, మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడి వచ్చి ఆర్థిక అభివృద్ధికి మాటలు వేసి  విదంగా  రైతులకు అవగాహనా
కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో  ఎమ్ సి  చైర్మన్  మిట్ట వెంకట రంగారెడ్డి, జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, ఎంపీపీ కర్నె  శివప్రసాద్,వ్యవసాయ జిల్లా  అధికారి గీతారెడ్డి, ఏ డి ఏ  రమాదేవి, శాస్త్రవేత్త ప్రవీణ్, ఏ ఓ తులసి ఇతరులు పాల్గొన్నారు.