వ్యవసాయ అద్దె పరికరాలను ప్రారంభించిన - ఎమ్మెల్యే సంజయ్

Published: Wednesday April 12, 2023
సారంగాపూర్, ఏప్రిల్ 11 (ప్రజపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సెర్ఫ్ ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలు మరియు అద్దె ట్రాక్టర్ ను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత లైబ్రరీ చైర్మన్ డా: చంద్రశేఖర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ బీద రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలానికి చెందిన 6 గురు లబ్దిదారులకు 2 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి సర్పంచ్  వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ గుర్రాల రాజేందర్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నరసింహారెడ్డి జోగినపల్లి సుధాకర్ రావు ఎడ్మల లక్ష్మారెడ్డి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ముంతాజ్ బేగం ఏపీఎం రాజు సిఎలు వివోలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.