ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

Published: Friday July 01, 2022

ఇబ్రహీంపట్నం, జూన్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్షకొండ గ్రామ పంచాయతీ వద్ద పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్.టి  లపై జరిగే సాంఘిక దురాచారాలు, అసమానతలు, అంటరానితనం, అస్పృశ్యత వంటి  అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి అంశాలపై పలువురు మాట్లాడుతూ డిప్యూటీ తహశీల్దార్ పద్మ, పైఅంశాలపై మాట్లాడుతూ అందరూ సమానమే అని కుల మత  విబేధాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని గ్రామంలో ఇటువంటివి ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకరావాలని ఎస్సై ఆర్.ఉమాసాగర్,   తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ తహశీల్దార్ పద్మ , ఎంపీటీసీ పోనకంటి చిన్న వెంకట్, ఉప సర్పంచ్ మంగిలిపెళ్లి లక్ష్మణ్, ఆర్ ఐ  భూమేశ్ ,పంచాయతీ కార్యదర్శి రాకేష్, విఆర్వో  శ్రీనివాస్, దొంతుల తుక్కారం , అంబేడ్కర్ సంఘం సభ్యులు గుజ్జరి ప్రకాష్, గోపి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.