మున్సిపాలిటీల అభివృద్ధి కి వెయ్యి కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలి ముఖ్యమంత్రికి విజ్ఞప

Published: Monday November 28, 2022
బెల్లంపల్లి నవంబర్ 2 7 ప్రజా పాలన ప్రతినిధి:  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో  ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం , వెయ్యి కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని  ముఖ్యమంత్రి కి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ పోరం చైర్మన్ రాము నాయక్ ఆదివారం విజ్ఞప్తి చేశారు.
 
ఈ సందర్భంగా ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు, 
 ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న కార్పొరేటర్, కౌన్సిలర్లకు, ఐదు వేలు,  చైర్మన్ లకు, మేయర్లకు, పదివేల రూపాయల పింఛను ల తో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం కల్పించాలని, మహిళా కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు స్కూటీ వాహనాలు మంజూరు చేయాలని కోరారు.
 పట్టణ ప్రగతి ద్వారా మంజూరైన నిధులలో 50% వార్డులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని,
 ప్రతి సంవత్సరం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయాలని,
 హైదరాబాదు నగరంలో, నూతనంగా మున్సిపల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయాలని కోరారు.
 తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ 2019 చట్టాన్ని సవరణ చేసి, మున్సిపల్ కౌన్సిల్ కి అధికారాలు కల్పించాలని, కౌన్సిల్ సభ్యులకు గౌరవ వేతనం పదిహేను వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
 ఈ కార్యక్రమంలో  బెల్లంపల్లి చైర్మన్ జక్కుల శ్వేతా,  రాష్ట్ర వైస్ చైర్మన్ కొక్కెర చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.