ముఖ్యమంత్రి కేసీఆర్యాసంగి వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు కు రైతు ఆనందోత్సవం

Published: Thursday April 14, 2022
మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు ఇచ్చిన హామీతో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంగవీడులో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రైతు బాంధవుడిగా తెలంగాణ రైతులు కొనియాడుతున్నారు అని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు పేర్కొన్నారు. బుధవారం వంగవీడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆ గ్రామ సర్పంచ్ బొగ్గుల పద్మావతి అధ్యక్షతన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వరి రైతులను మోసం చేసిందని వారి బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని కేసీఆర్ ప్రకటించడం పట్ల యావత్ రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలోనే కెసిఆర్ అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కనుమూరు వెంకటేశ్వరరావు మధిర సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణుబాబు టిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ కోన నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ గ్రామ నాయకులు ఐలూరి జనార్దన్ రెడ్డి  బొగ్గుల వీరారెడ్డి, బండి వెంకటేశ్వర్లు సత్యనారాయణ రెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు.