గ్రామాభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తా : సర్పంచ్ జనుపల అశోక్ రెడ్డి

Published: Saturday May 22, 2021
పరిగి, 21 మే, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ జనుపల అశోక్ రెడ్డి అమెరికాలో ఉంటున్న NRI శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్ లో అన్నా మా గ్రామానికి మస్కులు సానిటీజర్స్ ఇవ్వండి అన్నా, అని  అడగడంతో ఏమాత్రం కాదు అనకుండా హైద్రాబాద్ లో వుండే తన మిత్రుని ద్వారా తమ గ్రామానికి 250 సానిటీజర్స్ మరియు 1000 మస్కులు ఒక పల్స్ ఆక్సీ మీటర్, ఒక థర్మల్ గన్ పంపించడం జరిగిందని దొంగ ఎన్కేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ జనుపల అశోక్ రెడ్డి అన్నారు. ఎక్కడో అమెరికాలో ఉండీ ఈ గ్రామనికి ఎలాంటి సంబంధం లేకున్నా నేను ఒక్క మాట అడగడంతో తన వంతు సహాయం అందించాడని పత్రికా ప్రకటనలో తెలియజేశారు. అనంతరం గ్రామ ప్రజలందరి తరుపున శ్రీనివాస్ రెడ్డికి అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇంతే కాకుండా మునుముందు ఎం అవసరం ఉన్న నాకు తోచిన సహాయం  తప్పక చేస్తానని అన్నారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ శానిటైజర్ మాస్కులు పంపిణీ చేస్తానని అన్నారు. తన గ్రామ అభివృద్ధికి, మరియు గ్రామ పంచాయతీ ప్రజలను కాపాడటమే నా ద్యేయం గా భావించి అవసరమైతే భిక్షాటన చేసైనా మా గ్రామ ప్రజలకు నేను అండగా ఉంటా, కాపాడుకుంటా! అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.