ఆరోగ్యం సీజనల్ వ్యాధి నుండి కాపాడుకోవాలి మున్సిపల్ చైర్మన్

Published: Monday August 01, 2022
మధిర జూలై 31 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాలు కార్యక్రమాలో ఈరోజు మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్  వారి గృహంలో స్వయంగా నిర్వహించడం జరిగినదిఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎవరికి వారు ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొని వారి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నిల్వ నీరు ఉండకుండా  చూసుకోవాలి అలాగే సీజనల్  వ్యాధులు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు