కటాస్, స్పైరింగ్ కరాటే విజేతలుగా కోటమర్పల్లి విద్యార్థులు

Published: Wednesday February 01, 2023
* మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి.రాచయ్య
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజా పాలన : ఏషియన్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో కోటమర్పల్లి విద్యార్థులు విజేతలుగా నిలిచారని మర్పల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి రాచయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం హైదరాబాద్ లో నిర్వహించిన 6, 8, 9, 10 సంవత్సరాల  కోటమర్పల్లి విద్యార్థులు కటాస్, స్పైరింగ్ విజేతలుగా నిలిచారని స్పష్టం చేశారు. 6 సంవత్సరాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన కటాస్ కరాటే పోటీలలో ప్రథమ స్థానంలో రిత్విక్,  ద్వితీయ స్థానంలో సాత్విక్. స్పైరింగ్ కరాటే పోటీలలో రిత్విక్, సాత్విక్ ఇద్దరు కూడా ద్వితీయ స్థానాన్ని సాధించారు. 8 సంవత్సరాల స్థాయిలో బాలికలు పాల్గొన్న కటాస్ కరాటే పోటీలలో ప్రథమ స్థానం వర్షిత, ద్వితీయ స్థానం నేహా. స్పైరింగ్ కరాటే పోటీలలో ప్రథమ స్థానం నేహా, ద్వితీయ స్థానం వర్షిత. 9 సంవత్సరాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన కటాస్ పోటీలలో జమీల్ ప్రథమ స్థానం, అభిలాష్ ద్వితీయ స్థానం. స్పైరింగ్ పోటీలలో ప్రథమ స్థానం అభిలాష్, ద్వితీయ స్థానం జాన్సన్. 10 సంవత్సరాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో కటాస్ లో ప్రథమ స్థానం రిషి, స్పైరింగ్ లో కూడా ప్రథమ స్థానం రిషి సాధించారని కరాటే మాస్టర్ నర్సిములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్  జైహింద్ రెడ్డి, మండల బి సి వైస్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, విలెజ్ వైస్ ప్రెసిడెంట్ పోచారం రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం గౌడ్, ప్రైమరీ స్కూల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మహబూబ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.