డ్రా పద్ధతిలో 38 మంది ఎంపిక

Published: Friday July 30, 2021
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటాజీ
వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజాపాలన : గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటాజీ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ పౌసుమి బసు కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ 2021- 22 పథకం ద్వారా 3వ, 5వ 8వ తరగతులలో అడ్మిషన్ కొరకు 46 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 38 సీట్లకుగాను జిల్లా కలెక్టర్ స్వయంగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. మూడవ తరగతికి 8 మంది బాలికలు, 10 మంది బాలురు. 5వ తరగతికి 7 మంది బాలికలు, 8 మంది బాలురు. 8వ తరగతికి 5 మంది బాలురు మొత్తం 38 మంది ఎంపికయ్యారని వివరించారు. ఎంపికైన విద్యార్థులు సెంట్ జూడ్స్ హై స్కూల్ వికారాబాద్, కెవిఎం హైస్కూల్ కుల్కచర్ల పాఠశాలలో ఉచిత రెసిడెన్సియల్ విద్యను అందించబడునని తెలిపారు.