సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Published: Saturday August 27, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా,  ఆగస్టు26 , ప్రజాపాలన, ప్రతినిధి : 
 
జిల్లాలో పూర్తిస్థాయి పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో అన్ని శాఖల అధికారులు సమన్యాయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్లో గల రైతు వేదికలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభల ద్వారా గ్రామపంచాయతీలలోపారిశుద్ధ్య కార్యక్రమాలను గుర్తించి పనులు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీ సభ్యులు వారికి కేటాయించిన మండలాలలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని ఇండ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో, ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు, మురుగు నీటి తరలింపు, ద్రవ వ్యక్త పదార్థాల నిర్వహణ అంశాలపై పరిశీలన పూర్తి చేసి అప్ లోడ్ చేయాలనిఅధికారులకు సూచించారు. జిల్లాలో ప్రస్తుతం విస్తరించిన సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల నియంత్రణ కొరకు గ్రామస్థాయి నుండి పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టారని తెలిపారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, తదితర విషజ్వరాల నియంత్రణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టి అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల లోపరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.12 నుండి 18 సం ఉన్న పిల్లలకు మొదటి, రెండవ డోసులు వారం రోజుల్లోపు పూర్తిచేయాలని, ఫ్రంట్లైన్ వర్కర్లకు మూడో త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.