పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలీ

Published: Thursday February 18, 2021
మధిర, ఫిబ్రవరి 17, ప్రజాపాలన: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ రేట్లు పెంచుతూ సామాన్యుడిపై భారం మోగుతున్న బిజెపి ప్రభుత్వాన్ని తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పార్టీ ని వ్యతిరేకించాలని బిజెపి అధికారంలో ఉంటే సామాన్య బతుకులు చిందరవందర అవుతాయనేది బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి గత సంవత్సరం నుండి మోడీ ప్రభుత్వం సామాన్యులు పైన భారం మోపుతూ చివరికి వంటగ్యాస్ ధరల కూడా ఇప్పటివరకు 170 వరకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్పై గగ్గోలు పెడుతూ ప్రజలను రెచ్చగొడుతున్న ఇతను కేంద్ర ప్రభుత్వం వల్ల పేద ప్రజలకు ఏమి మేలు జరిగిందో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో రైల్వే వ్యవస్థను ప్రారంభించక పోవడం రైలు రాకపోకలు నిషేధించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు ఆ పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారైన కిషన్ రెడ్డి గారు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అన్ని ట్రైన్ లు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.