బూర్గంపాడు ( ప్రజా పాలన.)

Published: Wednesday December 14, 2022

గత నాలుగు రోజులుగా మాండూస్ తుఫాన్ ప్రభావంతో ఆకాశం మేఘమృతమై ఉండటంతో పాటు సోమ, మంగళ వారాలు మండలాలలో అక్కడక్కడ చిరుజల్లులు చెదురు, ముదురు జల్లులు పడుతుండటంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. గత వారం నుండి ఖరీఫ్ వరి కోతలు ముమ్మురంగా కొనసాగుతుంటే ఈ మాండోస్ తుఫాన్  ప్రభావం వల్ల రైతులకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తేమ  శాతం ఎక్కువగా ఉన్నా గాని ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వారి యొక్క ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. తేమ శాతంతో పనిలేకుండా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు అన్నారు. రైతులకి వరికుప్పల పైన, రాశుల పైన పరదాలు వేసే విధంగా రైతులకి పరదలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉందని రైతులు అంటున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనాలని ఆరుగాలం పండించిన పంట ఈ మాండస్ తుఫాను వల్ల నష్టపోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందని దాని నుంచి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని రైతులు ఆవేదన విలపించారు.