స్వచ్ సర్వెక్షన్ గ్రామీణ విభాగంలో భారత దేశంలో జగిత్యాల జిల్లా రెండవ ర్యాంక్

Published: Saturday September 24, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి):  స్వచ్ఛ భారత మిషన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ సర్వెక్షన్ గ్రామీణ విభాగం లో భారత దేశంలో జగిత్యాల జిల్లా రెండవ ర్యాంక్ సాధించిన సందర్భం గా జిల్లా కలెక్టర్ జి. రవి ని కలెక్టర్ కార్యాలయం లో కలిసి  జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్,  లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్,  మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణిప్రవీణ్ పుష్ప గుచ్చం  అందజేసి శాలువా తో సత్కరించినారు. అనంతరం మాట్లాడుతూ భారత దేశం లో 750 జిల్లా లలో జగిత్యాల జిల్లా రెండవ స్థానం సాధించడం, తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో  12 వేల గ్రామ పంచాయతీ,141 మున్సిపల్, 10 కార్పొరేషన్ లలో స్వచ్ఛ భారత మిషన్ లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించి సుందరం గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి ది అని అన్నారు. జిల్లా దేశంలోనే రెండవ ర్యాంక్ సాధించిన సందర్భం గా కృషి చేసిన ప్రజా ప్రతినిదులు, మండల, జిల్లా స్థాయి అధికారులకు  శుభా కాంక్షలు అని అన్నారు. నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో, మున్సిపలిటీ లో హరిత హరం, పచ్చదనం, పరిశుభ్రత విభాగాల్లో కేంద్రం తెలంగాణ కి అవార్డ్ ఇవ్వడం జరిగింది అని, తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం, జగిత్యాల జిల్లా దేశంలోనే రెండవ స్థానం రావడం ముఖ్యమంత్రి ని కృషి పలితమని ప్రజలు గుర్తించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటితే ఇతర రాష్ట్రాల్లో పరిస్తితి ఎలా ఉంటుంది అనేది ప్రజలు గమనించాలి అని అన్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులకు, సహకరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా శుభా కాంక్షలు అని, పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని ప్రజల భాగస్వామ్యం తో రాబోయే రోజుల్లో జిల్లా కు మొదటి స్థానం రావడం ఖాయమని అన్నారు.