ఆక్రమణదారుల చెర నుంచి దోబిఘాట్ స్థలంను కాపాడాలని డిప్యూటీ తాసిల్దార్ కు వినతి

Published: Thursday December 09, 2021
మేడిపల్లి, డిసెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ సర్కిల్ చిల్కానగర్ డివిజన్లో దోబిఘాట్ స్థలం సర్వే నెంబర్ 793/1 .ఒక ఎకర 30 గుంటలు స్థలం కబ్జాకు గురైందని రజక సంఘం నాయకులు గగ్గోలు పెట్టిన, కబ్జా నుండి విముక్తి కల్పించాలంటూ ఎన్ని పోరాటాలు చేసినా ఆక్రమణదారుల చెర నుంచి విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఈ సమస్యను రజక సంఘం నాయకులు ఉప్పల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాగిడీ లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన రాగిడి లక్ష్మారెడ్డి  రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కబ్జాకు గురైన దోబీఘాట్ స్థలాన్ని కాపాడాలని ఉప్పల్ డిప్యూటీ ఎమ్మార్వో రఫిక్ కు వినతి పత్రం అందజేశారుు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆక్రమణల్లో దోబిఘాట్ స్థలాన్ని ఆక్రమణదారులు  వదులుకోలేక పైరవీలు చేస్తున్నారని అన్నారు. దీనికి కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకులు సహకరించి వారి పలుకుబడిని ఉపయోగించుకుని అక్రమంగా కబ్జా చేశారని తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో రజక సంఘం నాయకులు నన్ను ఆశ్రయించారని తెలిపారు. ఇకనైనా ఆక్రమణదారులను వెంటనే గుర్తించి ఈ సమస్యకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు  బిక్షపతి, శ్రీనివాస్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పప్పుల వెంకటేష్ (ఓ బి సి చైర్మన్) రాజ్యలక్ష్మి (చిల్కానగర్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్) కారీపే సంతోష్ కుమార్ (డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మేడ్చల్ మల్కాజిగిరి) ఆశు (కాంగ్రెస్ డిస్టిక్ మైనార్టీ చేర్మెన్) గణేష్ నాయక్ (చైర్మన్ టిపిసిసి ఎస్ టి సెల్) మలునయక్ (ఎస్ టి సెల్ సెక్రెటరీ) షబ్బీర్ హనుమంత్ గుప్త సురేందర్ సాయిబాబా పాల్గొన్నారు.