కేశవాపురంలో విద్యుత్ పనులకు మరమ్మతులు..

Published: Wednesday June 08, 2022

 తల్లాడ, జూన్ 7 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండల పరిధిలోని కేశవాపురం గ్రామ పంచాయతీలో ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా సోమవారం విద్యుత్ సమస్యలకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్యఅశోక్ దగ్గరుండి  పనులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో వేలాడిన తీగలకు, ట్రాన్స్ఫార్మర్ లకు మరమ్మతులు చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో శ్రమదానంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ సుందర్, లైన్ మెన్ తిరుపతి రావు, రమేష్ తదితరులు ఉన్నారు.