ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పనిచేస్తున్నారు

Published: Monday May 30, 2022
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో కమల్ రాజు, కొండబాల
మధిర రూరల్ మే 28 ప్రజా పాలన ప్రతినిధితెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పోరాడిన స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రాల హక్కుల కోసం తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రైల్వే గేట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు టిఆర్ఎస్ జిల్లా నాయకులు కౌన్సిలర్ మల్లాది వాసు ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందన్నారు. దీనిని గ్రహించిన ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఇతర పార్టీ నాయకులను ఐక్యం చేసి నేషనల్ ఫ్రంట్ ను స్థాపించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశారన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా తెలంగాణ హక్కులను కాల రాస్తుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తుందని, దీనికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మొదలపెట్టి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు మాజీ ఉప ప్రధాని దేవేగౌడను కలవడం జరిగిందన్నారు. కేంద్రంపై గతంలో ఎన్టీఆర్ చేసిన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించడం జరిగిందని వారు పేర్కొన్నారు. సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళుగా భావించిన స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు వైవి అప్పారావు మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జల్లేపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు