ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా చొరవతో ...అభివృద్ధి దిశగా సారపాక పట్టణం.........

Published: Wednesday December 28, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)

సారపాక పట్టణా అభివృద్ధికి ఏమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో  రెండు కోట్ల నిధులు .సారపాక1,2 పంచాయతీకి మంజూరు చేశారు . అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పట్టణంలో రోడ్లు ,మౌఖిక పరి స్థితిలో వాటి యొక్క స్థితిగతులను తెలుసుకోవడం జరిగినది. దానిలో భాగంగా ప్రభుత్వం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి సారపాక పట్టణ అభివృద్ధికి సుమారుగా రోడ్ల కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది .దానిలో భాగంగా ఈరోజు   పంచాయతీ ఏఈ  తో కలిసి రోడ్డు వాటి యొక్క కొలతలను  కొలుస్తున్నటువంటి  బి ఆర్ఎస్ నాయకులు.. ఎమ్మెల్యే రేగా కాంతారావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సారపాక పట్టణ  ప్రజలు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జనగం జగదీష్, బూర్గంపాడు పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ ఎర్ర శ్రీను, రాయల నరేంద్ర, బాలాజీ ,చల్లకోటి పూర్ణ, మరియు టౌన్ ప్రెసిడెంట్ శ్రీను, ఉపాధ్యక్షుడు ఏసోబు, బాలి శ్రీహరి, పంగి సురేష్, ఈశ్వర్ భూక్య చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.