రాంపూర్ లో పారిశుద్ధ్య పనులు సవ్యంగా నిర్వహించాలి

Published: Friday December 30, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 29 డిసెంబర్ ప్రజాపాలన : రాంపూర్ గ్రామంలో పరిశుద్ధ పనులు సక్రమంగా నిర్వహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం దారూర్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పాండునాయక్, పంచాయతీ కార్యదర్శులతో కలిసి గల్లీ గల్లీ తిరిగి ప్రజాక్షేత్రంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయం పాలనే లక్ష్యంగా తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతి తండా ఆర్థికంగా ఎదిగేందుకు జిపి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
గ్రామంలో నూతన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న పెంట కుప్పలను, పిచ్చిమొక్కలను తొలగించాలని రాంపూర్ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పారిశుధ్యం పనులు సరైన పద్దతిలో నిర్వహించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ వైర్, ఒక ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్థంబాలకు విద్యుత్ వైర్లు గుంజి విద్యుత్ దీపాలు అమర్చాలన్నారు. గ్రామంలో, పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని చెప్పారు. ప్రజలు చెర్రలను తీయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మిషన్ భగీరథ మంచినీటిని త్రాగేందుకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకలో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా, మండల రైతు బంధు అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య ముదిరాజ్, రాజ్ గుప్తా, మండల యూత్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి,  మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కారంజి వీరేశం, మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు దేవేందర్ నాయక్, మండల ఎస్సీ సెల్ సోషల్ మీడియా ఇంచార్జ్ విజయ్, సీనియర్ నాయకులు రవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.