మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరాలితుది శ్వాస వరకు ప్రజాసేవకే అంకితంజన్మదిన వేడుకల సభలో జిల్లా

Published: Wednesday October 26, 2022

మధిర రూరల్ అక్టోబర్ 25 (ప్రజా పలన ప్రతినిధి) మధిర నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ టిఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జి లింగాల కమల్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం టిఆర్ఎస్ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్ బాబు, కూనా నరేందర్ రెడ్డి, అబ్బూరి రామన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటిగా మండల పరిధిలోని ఆత్కూరు గ్రామoలో అబ్బూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి 11వ వార్డు కౌన్సిలర్ గద్దల మాధురి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన కేక్ కట్ చేసిన అనంతరం మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన సభలో పాల్గొని కేక్ కట్  చేశారు. ఈ సందర్భంగా లింగాల కమల రాజు మాట్లాడుతూ తన యొక్క పుట్టినరోజును రాజకీయ ప్రచార వేదికగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరాలని రాబోయే కాలంలో మధిర ఎమ్మెల్యేగా గెలుపు పొందె వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి రైతుబంధు రైతు బీమా దళిత బంధు లాంటి అనేక పథకాలు ప్రజల అభిమానాన్ని పొందుతున్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ఉన్నానని తన తుది శ్వాస వరకు ప్రజాసేవకే అంకితం అవుతానని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో నాలుగు జడ్పిటిసి లను 4 ఎంపీపీ లను 16 సహకార సంఘాలను టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందన్నారు. దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరి వెంకటేశ్వరావు జిల్లా నాయకులు మల్లాది వాసు చిత్తారి నాగేశ్వరరావు చావా రామకృష్ణ రంగిశెట్టి కోటేశ్వరావు తాళ్లూరి హరీష్ బాబు కూనా నరేందర్ రెడ్డి అరిగే శ్రీనివాసరావు అబ్బూరి రామన్ వాల్మీకి పవన్ జల్లేపల్లి బాబురావు గద్దల నాని రాజా తదితరులు పాల్గొన్నారు.