తెలంగాణ లో రైతుల జీవన విధానం మారింది.. --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

Published: Saturday July 30, 2022

జగిత్యాల, జూలై, 29 ( ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం లో రైతుల జీవన విధానం మారింది అని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండల హాస్నా బాద్ గ్రామ శాక అధ్యక్షులు వెంకటేష్ అధ్వర్యంలో హాస్నా బాద్ గ్రామ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మరియు వారి అనుచరులు టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా గా టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ఆహ్వానించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రజా స్వామ్యం లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అమలు చేయడం ప్రజా ప్రతినిధులు, నాయకులు పాత్ర అని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల రైతులు వ్యవసాయం తో పాటు, అనుబంధ వృత్తి చేపడుతూ ఆదాయం పొందుతున్నారు అని, రాత్రి వేలలో కుటుంబం తో గడుపుతున్నారు అని, గతంలో ఈ పరిస్థితి ఉండేదా అని, ఇంకా రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేశారు అని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డురమని అన్నారు. రైతులు జీవన విధానంలో మార్పు సుస్పష్టం అని రైతులే అన్నారని అన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా, ధరణి, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, సకాలం లో ఎరువుల పంపిణీ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు, సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లా రెడ్డి, రైతు బందు మండల కన్వీనర్ శంకర్, ఎస్టీ విభాగం అధ్యక్షులు శ్రీరామ్ బిక్ష పతి, పార్టీ ఉపాద్యక్షులు గంగాధర్, అర్బన్ మండల పార్టీ సంయుక్త కార్యదర్శి నరేందర్ రావు, నాయకులు వెంకట్ రావు, నాగరాజు, అంజి, రవి, అజయ్, తదితరులు పాల్గొన్నారు.