స్వయం ఉపాధి పొందుతూ ఉద్యోగావకాశాలు

Published: Tuesday February 22, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన : స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కేంద్రంలో న్యాయవాది పిల్లికండ్ల ఆనంద్ నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వకేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ సేవలు అందించేటప్పుడు తరతమ భేదాలు చూపకుండా సమన్యాయం చేయాలని సూచించారు. న్యాయవాది పిల్లికండ్ల ఆనంద్ మాట్లాడుతూ సేవా దృక్పథమే ప్రాధాన్యతగా భావిస్తానని పేర్కొన్నారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు న్యాయ సహాయం అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు,  తదితరులు పాల్గొన్నారు