అమరజీవి చెర్క జగన్నాధం ఆశయాలను సాధిస్తాం.సిపిఎం

Published: Saturday October 09, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని గోకారం మాజీ సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ చెర్క జగన్నాధం ఆశయాలను సాదించేందుకు నిరంతరం కృషి చేయాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు మద్దెల రాజయ్య,సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు అన్నారు. శుక్రవారం చెర్క జగన్నాథం 24వ వర్ధంతి సందర్భంగా సిపిఎం మండల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ చెర్క జగన్నాథం చిన్నతనంలోనే ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమం ద్వారా వామపక్ష భావాజాలానికి ఆకర్షితుడై గోకారం గ్రామంలో ప్రజా సమస్యలపై నిరంతరం పని చేసే వాడిని ప్రధానంగా పేదలు వ్యవసాయ కార్మికులు,కూలీల సమస్యలపై గ్రామంలో ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసేవారని అన్నారు ఆ సమయంలోనే గోకారం గ్రామ సర్పంచ్ ప్రజలు అవకాశం కల్పిస్తే సర్పంచ్ గా గెలుపొంది నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్న సందర్భంలో ఓర్వలేని భూస్వాములు నక్సలైట్లతో కుమ్మక్కై తప్పుడు ప్రచారం ద్వారా జగన్నాథంని చంపాలని అనేక కుట్రలు చేశారన్నారు. వలిగొండ మండల కేంద్రంలో మిట్టమధ్యాహ్నం రెండు గంటలకు ఆయనను తుపాకులతో కాల్చి చంపారని ఆయనను చంపితే ఎర్ర జెండా లేకుండా పోతుందని అనేకమంది పేదల భూముల్ని ఆక్రమించుకోచ్చనే  ఉద్దేశంతో భూస్వామ్య శక్తులు కుట్రలు చేసినా జగన్నాథం గారి స్ఫూర్తితో సిపిఎం పార్టీ గత మూడు పర్యాయాలు గా గ్రామంలోని సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. ఆయన నిరంతరం పేదల పక్షాన నిలిచిన గొప్ప వ్యక్తిని భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయెందుకు యువత ముందుకు రావాలని, ఆయన చూపిన మార్గంలో ఎర్రజెండాను చేతపట్టి ముందుకు తీసుకుపోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కూర శ్రీనివాస్, మెరుగు వెంకటేశం, సిపిఎం గోకారం శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, పొద్దుటూర్ శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం సిపిఎం మండల నాయకులు సిర్పంగి శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ భూమి బాలశంకర్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు వడ్డేమని మధు, జాలుకాల్వ శాఖ కార్యదర్శి బండమీది సుందరయ్య, నాయకులు తాందర్పల్లి గోపాల్, ఈర్ల నవీన్, దండు వేణు, వరికుప్పల చిరంజీవి, కొరబోయిన మహేష్, తదితరులు పాల్గొన్నారు.