కెసిఆర్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం పట్టణ ప్రగతి విజయవంతం చేయండి. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ ర

Published: Wednesday June 08, 2022
ప్రజాసమస్యలు వదిలేసి పార్టీలు ఇప్పుడు
టిఆర్ఎస్ పాలనలో సమృద్ధిగా గ్రామ పంచాయతీకి అభివృద్ధి నిధులు.
పట్టణ ప్రగతి తో మారనున్న మధిర రూపురేఖలు.ప్రతి వార్డు లో పూడికతీత పనులు నిర్వహించాలి.మున్సిపాలిటీ అభివృద్ధి లో టిఆర్ఎస్ మార్కు కనిపించాలి.21 వార్డులో జరిగిన పట్టణ ప్రగతి సమావేశంలో మాట్లాడిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి  కార్యక్రమాలను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 21 వ వార్డు లో జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు ప్రతి కుటుంబానికి అందుతుందని తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వం లోనే చిన్న చిన్న గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామపంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతుందని  ఈ నిజం తెలియని కొందరు మూర్ఖులు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సిరిపురం గ్రామంలో 24 లక్షల రూపాయల పంచాయతీ నిధుల తో సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అదేవిధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఈ నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చునని సూచించారు. స్థానిక పార్టీ నాయకులు ఎక్కడ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి హైదరాబాదులో ప్రెస్ మీట్ లకే పరిమితమయ్యారని విమర్శించారు. టిఆర్ఎస్ 8 సంవత్సరాల పాలనలో 80 సంవత్సరాల అభివృద్ధి సాధించిందని వివరించారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి లో టిఆర్ఎస్ మార్పు కనిపించే విధంగా వార్డ్ కౌన్సిలర్ లు పనిచేయాలని మధిర అభివృద్ధికి బాటలు వేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, కమిషనర్ రమాదేవి టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాస రావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి  రైతుబంధు కన్వీనర్ చావా వేణుబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై వి అప్పారావు, వార్డ్ కౌన్సిలర్ లు ముత్తవరపు రాణి ప్యారి, ఎర్రగుంట లక్ష్మీ రమేష్, రెండో వార్డ్ కౌన్సిలర్ ఇక్బాల్, టిఆర్ఎస్ నాయకులు కొటారి రాఘవరావు ఓంకార్ మేడికొండ కిరణ్ గద్దల నాని గద్దల రాజా, డోకు పర్తి సత్యంబాబు, ఖాదర్, పట్టాభి, శివ, మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.