ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన నాగటి ప్రసాద్ రావు

Published: Monday February 14, 2022
బోనకల్, ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్లు మండలం పెద్ద బీరవెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి1989 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిని సాధించి సామాజిక స్పృహ చైతన్యం సేవాభావం, త్యాగశీలత, ఉదార స్వభావం, మృదు తత్వం, కార్యదీక్షత పట్టుదల కలిగిన విద్య కృషి వంతుడు నాగటి ప్రసాదరావు జిల్లా ఉత్తమ అవార్డులు రాష్ట్రంలో పలు సేవా రంగాల్లో రాష్ట్ర అవార్డులు, జాతీయ అవార్డులు అందుకున్నారు. ది 12.02.2022న తను చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి కీర్తి ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు జాతీయ సేవ రత్న నంది అవార్డు2022ను ప్రధానం చేసినారు. ఎయిడ్స్ రోగులకు, కరోనా కష్టకాలంలోనిరుపేదలకు సహాయం అందించి విద్యా సేవ, క్రీడలను ప్రోత్సహించి బహుమతులు ఇవ్వటం, మెరిట్ విద్యార్థులకు పారితోషకం నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, తను పనిచేసిన పాఠశాలలను పచ్చని హరితవనం గా తీర్చిదిద్దటం, వృత్తిపట్ల అంకిత భావం కరోనా కష్టకాలంలో రోగులకు నిత్యవసర వస్తువులు పండ్లు, బియ్యం, కూరగాయలు, బట్టలు సరుకులు పంపిణీ చేసినారు. ఈ జాతీయ సేవ రత్న అవార్డు ఏపీజే అబ్దుల్ కలాం, రాష్ట్రీయ సమాన్ పురస్కార్ అవార్డు రాష్ట్రస్థాయి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, జ్ఞాన ప్రతిష్ఠాన్ అవార్డు, గురుబ్రహ్మ పురస్కార్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. వీరి క్రమశిక్షణ విద్యతో ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాల్లో, రాజకీయ సేవా రంగాల్లో ప్రయోజకులుగా తయారు చేసినారు. కృషి పట్టుదల, నిరంతరం శ్రమ నిరాడంబరత, మృదు తత్వం ప్రతి మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, వారే సమాజానికి నిజమైన రత్నాలు అని నాగటి అభిప్రాయపడ్డారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను రాష్ట్రస్థాయి జాతీయస్థాయి అవార్డు అందుకున్న నాగటి ప్రసాద రావుకు పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలిపారు.