దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి

Published: Tuesday May 17, 2022

ఆసిఫాబాద్ జిల్లా మే16(ప్రజాపాలన, ప్రతినిధి) : దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి, దిశగా ప్రభుత్వం దళిత బందు కార్యక్రమాన్ని చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం  దళిత బంధు పథకం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపికైన 18 మంది లబ్ధిదారులకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్సీ దండే విట్టల్,ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రతి లబ్దిదారునికి రూ 10 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 12 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ముగ్గురికి కార్లు, ముగ్గురికి ఆటో ట్రాలీ లు  మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈ డి సంజీవన్, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపి మల్లికార్జున్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.