మా పంట పొలాలకు నీరు అందించండి సర్పంచ్ ఆధ్వర్యంలో డి ఈ నీ సాగర కాలవపై నిర్బంధించిన రైతులు

Published: Tuesday March 07, 2023

బోనకల్, మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి: మా పంట పొలాలకు నీరు అందించండి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం రెండు గంటలు పాటు సాగర్ కాలువపై నీటిపారుదల శాఖ డి.ఈ ని సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ ఆధ్వర్యంలో రైతులు నిర్బంధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టు పరిధిలో మొక్కజొన్న పంట ఎండిపోతున్న అధికారులు స్పందించడం లేదని అన్నారు. సాగర్ ఎడమ కాలువ కు 11000 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అందులో 7000 క్యూసెక్కుల నీరు అందించాల్సిన బాధ్యత ఉందని అలా కాకుండా కేవలం రెండున్నర వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం వల్ల బ్రాంచి కాలువలు తూములకు నీరు అందడం లేదని, ఆరకోరగా నీరు వచ్చిన జిల్లా అధికారులు వారబంది విధానం ద్వారా సాగర్ జలాలు సరఫరా చేయడం వల్ల ఆయకట్టు చివర భూములకు సాగునీరు అందక పంటలు మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అన్నారు . సాగర్ ఆయకట్టు కు విడుదల చేయాల్సిన ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని వారబంది విధానం ఎత్తివేసి సాగర్ జలాలు మార్చి చివరి వరకు నిరంతరాయంగా సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు. సాగునీరు పూర్తి స్థాయిలో నిలుపుదల చేయడం సరికాదని అన్నారు.ఎండలు తీవ్రత ఎక్కువ అవుతున్న సందర్భంలో సాగు నీరు అవసరం పెరుగుతున్నది అని మొక్కజొన్న పంట కంకి గింజపోసుకున్నె దశలో ఉంది అని నాలుగు, ఐదు రోజుల నీరు అందకపోతే మండలంలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బ తింటుంది అని అన్నారు
అధికారులు అందుబాటులో లేకపోవడం, రైతులకు సాగర్ నీరు అందక నష్టపోతున్నారని సర్పంచ్ తో రైతులు రెండు గంటలు పాటు నిరసన కొనసాగించి డి ఈ నీసాగర్ కాల్వ పై నిర్బంధించారు. చివరి భూములకు సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.