ఇబ్రహీంపట్నం మండల మహిళా సమైక్య 14వ సర్వ సభ్య సమావేశం ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ కృపేశ్ ఎంపీడ

Published: Friday July 29, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి. రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం రోజున ఎంపీడీవో కార్యాలయం హాల్ నందు ఇబ్రహీంపట్నం మండల మహిళా సమైక్య 14వ సర్వసభ్య సమావేశం సమాఖ్య అధ్యక్షురాలు యం అనురాధ  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క సమావేశనికి ముఖ్య అతిధిగా మండల్  ఎంపీపీ కృపేష్  మరియు ఎంపీడీఓ క్రాంతి కిరణ్  హాజరయ్యారు. ముందుగా సమావేశం నందు ఎంపీపీ   ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది.
తర్వాత గత సంవత్సరం అనగా 2021-2022 సంవత్సరమునకు సంబంధించిన ఆడిట్ మరియు ప్రగతి నివేదిక ను ఎంపీపీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
మండల సమాఖ్య అధ్యక్షురాలు,కార్యదర్శి మరియు కోశాధికారి వార్షిక ప్రణాళిక రిపోర్టు చదివి వినిపించడం జరిగింది.
మండల సమాఖ్య ఏర్పాటు తేదీ 20-04-2006.
మండల సమైక్య నందు సభ్యత్వం కలిగిన గ్రామ సంఘాలు:32.
మండల సమాఖ్య నందు ఉన్న సంఘాలు:936.
సంఘంలో చేరిన సభ్యుల సంఖ్య: 9781.
మండలంలోని వికలాంగుల సంఘాల సంఖ్య 25.
మండలం లోని వికలాంగుల సంఘాల లోని సభ్యులు 278.
మండల సమైక్య కి వచ్చినా( CIF) సి ఐ ఎఫ్ రూపాయలు74,54,784  లబ్ధి పొందిన సభ్యుల సంఖ్య:8751
మండల వికలాంగుల సమైక్య పు సమైక్య ద్వారా వచ్చిన (CIF) సిఐఎఫ్ :12,10,000 రూపాయలు గత సంవత్సరంలో 2021 2022 లో బ్యాంక్ లింకేజ్ లో పొందిన సంఘాల సంఖ్య 718 లబ్ధి పొందిన మొత్తం రూపాయలు 32,51,28,000 రూపాయలు.
స్త్రీ నిధి ద్వారా 4,99,15,400 రూపాయలు ఇప్పించడం జరిగింది మొత్తం ఇప్పటివరకు మండల మహిళా సమైక్య కార్పస్ :1,67,95,464 గా వున్నది.
ఎంపీడీవో  క్రాంతి కిరణ్  మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల మహిళా సమైక్య ఎప్పుడైనా ప్రగతి సాధన లో జిల్లాలోని మొదటి స్థానంలో ఉంటుందని  చెలియాజేశారు  మరియు మహిళా మనులందరికి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం 50 శాతం రిజర్వేషన్ ను సద్వినియోగం చేసుకొని సంఘాల ద్వారా లబ్ధి పొంది   సుస్థిరమైన జీవనోపాధిని పొందాలన్నారు. ఎంపీపీ కృపేష్ మాట్లాడుతూ  మహిళలు గతంలో ఇంటి గడప దాటాలంటే భయపడే వారు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
మహిళ  సంఘాలు  ప్రారంభం నాడు 20  రూపాయల పొదుపు తో ప్రారంభించి ఈ రోజుల్లో ఒక్కరొకరికి పొదుపు 200 రూపాయలు సంఘాలలో జమ చేస్తున్నారు తద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు బ్యాంక్ లింకేజీ,స్త్రీ నిధి  సి ఐ ఎఫ్ ద్వారా పొంది వస్తువులు కొనుగోలు చేసుకొని తద్వారా మెరుగైన  జీవనోపాధి  పొందాలన్నారు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా మహిళలకు సబ్సిడీ రుణాలు యాబై లక్షలు రూపాయలు వరకు పొంది మహిళాలు పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలన్నారు.
దీనికి తన వంతు కృషి చేస్తానన్నారు గ్రామాలలోని మహిళా సంఘాల సభ్యులు ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృస్టికి తీసుకరావాలన్నారు గ్రామాలలోని అన్నీ గ్రామ సంఘాల నందు మరుగుదొడ్లు నిర్మించి ఇప్పించగలము అన్నారు. మండలం నందు కలిగిన మహిళా సంఘాలు సక్రమంగా నిర్వహించుకోవడం మరియు తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడం వల్ల మన మండలం రాష్ట్రస్థాయి అవార్డు రావడం అభినందనీయమని కొనియాడరు,అన్నీ రంగాలలో మహిళలు ముందజలో ఉంటున్నారు అని ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగుతూ ఆర్దికంగా,సామాజికంగా సుస్థిరమైన జీవనోపాధిని పొందాలన్నారు.
అనంతరం  ఎంపీపీ మరియు ఎంపీడీవో లను  మండల సమైక్య తరపున సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి , ఏపిఎం రవీందర్,సెర్ప్ సిబ్బంది స్త్రీనిధి మేనేజర్ రవి మరియు మహిళా సమాఖ్య అధ్యక్షులు అనురాధా,కార్యదర్శి నిర్మల,కోశాధికారి సంధ్య,ఉపాధ్యక్షులు మహేశ్వరి, సహాయకార్యదర్శి పారిజాత, ఎం వి ఎస్ అధ్యక్షులు జంగయ్య వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు,కోశాదికారులు హాజరైనారు.