ఘనంగా ఆలేరు లో కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవం

Published: Wednesday December 29, 2021
యాదాద్రి-భువనగిరి జిల్లా 28 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఆలేరు లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన పలువురు నేతలను స్మరించుకున్నారు. యాదాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ... భారత జాతీయ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ద్వారా, విస్తృతంగా ఆధారితమైన భారతదేశ రాజకీయ పార్టీ. 1885లో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్ గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం కోసం భారత ఉద్యమంలో ఆధిపత్యం చెలాయించింది. తదనంతరం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశంలోని చాలా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. తరచుగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలలో బలమైన ఉనికిని కలిగి ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వ కాలం బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయవాద ఉద్యమం 1850ల నాటిది. అయినప్పటికీ భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా డిసెంబర్ 1885లో సమావేశమైంది. అనేక దశాబ్దాలలో, కాంగ్రెస్ పార్టీ చాలా మితమైన సంస్కరణ తీర్మానాలను ఆమోదించింది. 20వ శతాబ్దం ప్రారంభంలో, పార్టీలోని అంశాలు స్వదేశీ ("మన స్వంత దేశం") విధానాన్ని ఆమోదించడం ప్రారంభించాయి. ఇది దిగుమతి చేసుకున్న బ్రిటీష్ వస్తువులను మరియు ప్రమోట్ చేసిన భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని భారతీయులకు పిలుపునిచ్చింది. 1917 నాటికి, సమూహం యొక్క "ఉగ్రవాద" హోమ్ రూల్ వింగ్.  భారతదేశంలోని విభిన్న సామాజిక వర్గాలను ఆకర్షించడం ద్వారా గణనీయమైన ప్రభావాన్ని చూపడం ప్రారంభించిందని అన్నారు. ఇతర నేతలు ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. తదుపరి ఆలేరు సీనియర్ కాంగ్రెస్ నాయకులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకటస్వామి దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో దేశాన్ని ముందంజలో ఉంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం బిన్నత్వం లో ఏకత్వం అయినటువంటి మన భారతదేశాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి. రాష్ట్ర  ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకట్ స్వామి. నియోజకవర్గ ఇన్చార్జి బిర్లా ఐలయ్య,  పట్టణ అధ్యక్షులు యం.ఎ. ఎజాజ్, సాగర్ రెడ్డి. విజయ్ కుమార్, లోకేష్, మంద లక్ష్మి, సత్యం, విక్రమ్, శ్రీశైలం ఉప్పలయ్య యాదగిరి సంపత్ మొదలగువారు పాల్గొన్నారు.