ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయాలి. డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాల

Published: Wednesday October 19, 2022
 చేవెళ్ల అక్టోబర్ 18 (ప్రజాపాలన): 
 
 భారత విద్యార్థి ఫెడరేషన్స్  ఎస్ఎఫ్ఐ  చేవెళ్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్ర పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమస్యలు ఎస్ ఎఫ్ ఐ  డివిజన్ అధ్యక్షుడు బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కేజీ నుంచి పేజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నామని ప్రలోభాలు పలుకుతున్న సీఎం కేసీఆర్ గారు ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు.

ఎస్ఎఫ్ఐ 1970లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేసి ఆ సమస్యలను పరిష్కరించిన ఘనత ఎస్ఎఫ్ఐ దానిని అన్నారు. స్కాలర్షిప్ లో విడుదల చేయించడంలో హాస్టల్లో హాస్టల్ వసతులు సాధించడంలో బసౌకర్యాలు ఇలా అనేక సమస్యలు పరిష్కరించిన ఘనత ఎస్ఎఫ్ఐ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచే ప్రభుత్వ విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటం మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  స్ ఎఫ్ ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి  ఎర్రవల్లి శ్రీనివాస్, కుమార్, రాజు, సాయిరాం ,విద్యార్థులు పాల్గొన్నారు**.