ఎంకేపల్లి గ్రామ పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి

Published: Wednesday December 07, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో ఆరు డిసెంబర్ ప్రజా పాలన : పారిశుద్ధ్య పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం కోటపల్లి మండల పరిధిలోని ఎంకేపల్లి గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల భారతమ్మ ప్రభాకర్ రెడ్డి ఉప సర్పంచ్ ఎం శ్రీనివాస్ తో కలిసి మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఉదయం 6:30 గంటల నుండి 9:30 వరకు గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట నూతన విద్యుత్ స్థంబాలు ఏర్పాటుతో పాటు విద్యుత్ దీపాలు అమర్చాలని చెప్పారు. గ్రామంలో, పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు తెలిపారు. గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1, 11, 21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.
గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు, పిచ్చిమొక్కల తొలగింపు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు. గ్రామంలో 1వ, 7వ వార్డులలో నీటి సమస్యను పరిష్కరించాలని వెల్లడించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీ సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, పరిశుభ్రమైన మంచి నీటిని ప్రతి ఇంటికి అందించాలన్నారు. ప్రజలు చెర్రలు తీయకుండా నీటి సరఫరా చేసేవారు పరిశీలించాలన్నారు. మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పల్లె ప్రగతి సక్రమంగా ఎందుకు నిర్వహించడం లేదని పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో పూర్తి కాలేని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకలో ఉంచాలన్నారు.
అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. నూతనంగా నిర్మించబోయే సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ పిఎసిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి ఏఎంసీ చైర్మన్ ఉప్పరి మహేందర్ దశరథ్ గౌడ్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుశ ఈశ్వరయ్య రైతుబంధు అధ్యక్షుడు సిలార్ మియా ఎంకేపల్లి గ్రామస్తులు ఎం ప్రవీణ్ సత్యం గోవర్ధన్ రెడ్డి గోపాల్ ప్రభాకర్ రెడ్డి అనంతయ్య అబ్రహం ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.