అనాధ శరణాలయంలో అన్నదానం

Published: Tuesday March 02, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కే కృష్ణమూర్తి చారి సునంద ల 25 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమీన్పూర్ లోని మహిమ మినిస్ట్రీస్ అనాధ శరణాలయంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కే కృష్ణమూర్తి చారి సతీమణి కే సునంద మరియు వారి కుటుంబ సభ్యులు రాజేందర్ చారి, సుజాత, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కే కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం శ్రేష్టమైనదని ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత వరకు అన్నదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మనం ఇతరులకు సాయం చేస్తే దేవుడు ఏదో రూపంలో మనకు సాయం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అనంతరం కృష్ణమూర్తి చారి ఆయన సతీమణి సునంద వారి వివాహ వార్షికోత్సవ వేడుకలు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి  ఆలయంలో ఘనంగా  జరుపుకున్నారు.