దళితుల శ్మశాన వాటిక కబ్జా కు గురికాకుండా ఉండాలని అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం

Published: Wednesday May 25, 2022

బోనకల్, మే 24 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం (ఎల్ )గ్రామానికి చెందిన వారు మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ రావు కి వినతి పత్రం ఇవ్వటం జరిగినది. గోవిందపురం (ఎల్ )గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దళితుల స్మశాన వాటిక స్థలం కొందరి ఆక్రమణకు గురి అవుతున్నందున సంబంధిత రెవెన్యూ అధికారుల చే సర్వే చేపించి స్మశాన వాటిక స్థలం కబ్జాకు గురికాకుండా ఉండేందుకు, ఇట్టి స్థలములో కొందరు పెద్దలు కావాలని ,గత మూడు సంవత్సరాలుగా ఈ స్థలంపై కన్నేసి దళితులకు చెందకుండా, దళితులకు స్మశాన వాటిక స్థలం అవసరమా అంటూ ఎవరైనా చనిపోతే పూడ్చి పెట్టే పద్ధతి సరైనది కాదని లేనిపోని మాటలతో అధికారులను ఒప్పించి ఈ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర జరుగుతున్నది. గత 70 సంవత్సరాల కు పైగా ఈ స్థలంలో దళితులు ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారు ఎవరో చనిపోయిన పూడ్చి పెట్టి వారి సాంప్రదాయం ప్రకారం కొందరు సమాధులు నిర్మించుకుంటున్నారు ఇది తరతరాలుగా ఎస్సీలు ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నారు. ఎస్సీ కాలనీలో లో సుమారు గా 450 కుటుంబాలు పదిహేను వందల మంది జనాభాతో ఉన్న దళితవాడ సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందుతూ పెద్ద కాలనీగా రూపాంతరం చెందుతున్నది. ఇప్పటికీ నా భూమిలో సుమారు గా ఎకరం కు పైగా సమాధులు నిర్మించబడి ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి స్థలంలో సుమారు రెండు ఎకరాలు పొలం ఉంటే తప్ప స్మశాన వాటిక స్థలం సరి పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వ జీవో ను అనుసరించి జీవో నెంబర్ 1235 ప్రకారం ప్రతి దళితవాడకు రెండెకరాల స్మశాన వాటిక స్థలం కొని ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ఇక్కడ కొందరు పెద్దలు కావాలని ఉన్న స్థలాన్ని కాజేసేందుకు ఎలాగైనా ఈ స్థలంలో ఏదో ఒకటి నిర్మించి స్థలం కాజేసేందుకు పావులు కదుపుతున్నారు . ఈ స్మశాన వాటిక స్థలం కోసం గత మూడు సంవత్సరాలుగా ఎస్సీ కాలనీకి చెందిన పెద్దలు యువత ప్రజా ప్రతినిధులు అధికారులను కలిసి సర్వే చేయించమని కోరగా 3 సంవత్సరాల క్రితం అప్పటి సర్వేయర్ కోట వెంకటరత్నం తో సర్వే చేయించినారు. ఆ సర్వే రిపోర్టు రాకుండా కొందరు అడ్డుపడి అధికారులను తప్పుదోవ పట్టించి సర్వే రిపోర్టుఇవ్వకుండా ఆపినారు. మరల ఇప్పటి తాసిల్దారు రావూరి రాధిక ఎస్సీ కాలనీకి చెందిన యువత కలిసి దరఖాస్తు సమర్పించి సర్వే చేపించి మాకు హక్కు కల్పించగలరని కోరినారు. కానీ నేటి వరకు కు సర్వే చేయించకుండా కాలయాపన చేస్తున్న విషయమై తాసిల్దార్ దృష్టికి కేసు పెట్టడం జరిగినది. గత 5 సంవత్సరాల క్రితం స్మశాన వాటిక స్థలం వద్ద మసీదు వెనక భాగంలో లో ప్రహరి నిర్మిస్తుండగా కాలనీ పెద్దలు అచ్చటకు వెళ్లి ప్రహరి మా స్థలం లోకి వస్తే బాగోదు అని చెప్పి ముస్లిం పెద్దల తో మాట్లాడి బౌండరీ దాటి రాకుండా అందరూ కలిసి కంచె వేసి స్మశాన వాటిక స్థలం కాపాడు కోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలెక్టర్ చొరవ తీసుకుని రెవెన్యూ అధికారులతో మాట్లాడి సర్వే చేయించి గ్రామపంచాయతీ తీర్మానంతో గత 70 సంవత్సరాలుగా మా స్వాధీనంలో ఉన్న మేము సమాధులు నిర్మించుకున్న స్థలం మసీదు వెనకభాగం నుండి ఆదూరి ప్రసాద్ పొలం వరకు హద్దులు నిర్ణయించి ఉన్న స్థలం మొత్తం ఎప్పటిలాగానే మాకు మా స్మశాన వాటికకు కేటాయించాలని దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డులో దళితుల స్మశాన వాటిక పేరుతో నమోదు చేయాలని కలెక్టర్ని కోరారు. అందరూ అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు మా సమస్యను అర్థం చేసుకొని రాజకీయాలకతీతంగా, మతాలకతీతంగా, కులాలకు అతీతంగా దళితుల పక్షాన ఉండాలని అని ఆశిస్తున్నాము. సమస్య పరిష్కారం అయ్యే అంతవరకు స్మశాన వాటిక స్థలం దళితులకు కేటాయించే వరకు సర్వే రిపోర్ట్ సమర్పించి రికార్డులలో నమోదు చేసేంతవరకు మేము కార్యక్రమాలను కొనసాగిస్తామని జీవో నెంబర్ 1235 ప్రకారం పూర్తి హక్కులు కల్పిస్తూ స్థలం కేటాయించాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మనోహర్ , కొమ్ము శ్రీనివాసరావు మాజీ జెడ్ పి టి సి, ఎంపీపీ, గ్రామ యువత ఇరుగు నరేష్, ఆదూరి గోపి, ముత్తారపు నవీన్, ఇరుగు సురేష్ ఆదూరి నరేష్ ముత్తారపు ప్రేమ్ కుమార్ ఇరుగు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.