ఉషోదయం కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

Published: Monday December 26, 2022
* 94400 32356 కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కరిస్తా
* 15 వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి
వికారాబాద్ బ్యూరో 25 డిసెంబర్ ప్రజా పాలన : వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని 15 వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఉషోదయం కార్యక్రమంలో భాగంగా 15వ వార్డుకు సంబంధించిన ప్రతి కాలనీలోని అపరిస్కృత సమస్యలను 94400 32356కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ఉదయం 5:30 గంటల నుండి 10:30 గంటల వరకు ఉషోదయం కార్యక్రమంలో భాగంగా గల్లి గల్లి తరిగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. లాలాగూడ ఫ్రెండ్స్ కాలనీ కమలానగర్ సాకేత్ నగర్ లో క్షేత్రస్థాయిలో పర్యటించి అపరిస్కృత సమస్యలను గురించి ఆరా తీశానని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా క్రిస్మస్ జన్మదిన అన్ని పురస్కరించుకొని లాలాగూడ ప్రాంతానికి వెళ్లి క్రిస్టియన్ సోదర సోదరీమణులను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపానని వివరించారు. క్రిస్మస్ పండుగను సోదర భావంతో సుఖశాంతులతో జరుపుకోవాలని సూచించారు. కరుణామయుడు శాంతి దూత ఏసుప్రభు సూచించిన సన్మార్గంలో ప్రతి పౌరుడు నడవాలని ఆకాంక్షించారు. సర్వమత ప్రాధాన్యత గురించి శాంతి దూత బోధనలు మనకు మార్గదర్శకం అవుతాయని స్పష్టం చేశారు. ఫ్రెండ్స్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. కాలనీలలో లూజ్ వైర్లను సరిచేయాలని లైన్మెన్ శంకర్ రెడ్డి కి తెలిపారు. ఏవైనా సమస్య ఉంటే నా సెల్ నంబర్ కి 94400 32356 కాల్ చేసి నా దృష్టికి తేవాలని కోరారు. మీ సమస్యను పరిష్కరించడానికి ఎల్లవేళల్లో అందుబాటులో ఉంటానని కాలనీ వాసులకు భరోసా కల్పించారు. జనంలోకి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కాలనీ వాసులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఉదయ్ కుమార్, నాగయ్య, టీచర్ పిచ్చయ్య, విట్టల్ రెడ్డి, జీవన్ కుమార్, పోలీస్ గోపాల్, బందయ్య, టీచర్ రాములు, రవి వర్మ , చంద్రమౌళి , కృష్ణ , నాగభూషణం, డిపిఆర్ సతీష్ కుమార్ మున్సిపల్‌ శానిటేషన్ డ్రైవర్లు, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.