వజ్రోత్సవాల్లో స్వతంత్ర సమరయోధులను విస్మరించడం శోషనీయండాక్టర్ మద్దెల ప్రసాద రావు

Published: Monday August 22, 2022

మధిర ఆగస్టు 21 ప్రజా పాలన ప్రతినిధి స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులను విస్మరించడం శోసనీయమని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గంలో మధిర ముదిగొండ మండలాల్లో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులను వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను 15 రోజులు పాటు నిర్వహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందులో ఒక్కరోజైనా స్వాతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులను గౌరవించే కార్యక్రమం చేపడితే బాగుండేదని ఆయన సూచించారు. ఎంతోమంది త్యాగదనుల పోరాటాలు ఫలితంగానే దేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు. అటువంటి స్వతంత్ర సమరయోధులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో సర్దార్ జమలాపురం కేశవరావు శీలం సిద్ధారెడ్డి బోడెపుడి వెంకటేశ్వరరావు నల్లమల్ల గిరి ప్రసాద్ రావు బొమ్మ కట్టి సత్యనారాయణ మిరియాల నారాయణ గుప్తా వేమిరెడ్డి ప్రతాపరెడ్డి లాంటి ఎంతోమంది యోధులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మధిర సరిహద్దు కేంద్రంగా పోరాటాలు చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు ప్రజలందరూ మార్పు కోసం రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆదరించవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల అధ్యక్షులు సామినేని రవి మరికంటి శ్రీనివాసరావు మరికంటి వెంకట్ లక్ష్మారెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు