బెల్లంపల్లిలో రైస్ మిల్ కార్మికుల సమ్మె ,

Published: Friday December 16, 2022
 పట్టించు కొని మిల్లుల యజమానులు
 
 
బెల్లంపల్లి డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని రైస్ మిల్లు కార్మికులకు సంవత్సరంపాటుగా పాత రేటు  ఇస్తు కార్మికులను  మోసం చేస్తున్నారని,కొత్త రేటును పర్సంటేజ్ ప్రకారం అమలుపరచాలని రైస్ మిల్లు కార్మికులు కోరారు. 
గురువారం వారు మాట్లాడుతూ
మంచిర్యాలలో 10 శాతం ఇస్తున్నారని మీకు అదే ఇస్తామని బెల్లంపల్లి రైస్ మి ల్లు యాజమానులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని,మంచిర్యాలలో ఒక్కో కార్మికునికు   800 రూపాయలు వస్తాయని బెలంపల్లి పరిధిలో కేవలం 350 కి తక్కువగానే వస్తున్నాయని, పర్సంటేజ్ ప్రకారం  20 శాతం రేటు పెంచాలని డిమాండ్ చేస్తున్నా కార్మికులకు కనీసం  15 శాత మైన ఇవ్వాలని కోరారు. మిల్లులో పనిచేసే కార్మికులకు నీటి సౌకర్యం కల్పించాలని ,దుమ్ము,దూలీకి ఇబ్బందులకు గురి కాకుండ బెల్లం ఇవ్వాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7  వరకు పని సమయం  కల్పించాలని, కార్మికులకు అందరికీ  ఇన్సూరెన్స్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు, 
మిల్లు కార్మికుల డిమాండ్ నేర వెర్చే వరకు వరకు సమ్మె కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజన్ రైస్ మిల్లు కార్మికుల అధ్యక్షులు  గెల్లి రాజలింగు, ఉపాధ్యక్షులు కెమ్శెట్టి సమ్మయ్య, కొమురయ్య,  దుర్గయ్య, ధరణి శంకర్, అల్లం రవి, ఎస్ రవి ,స్వామి, మల్లేష్, లచ్చన్న ,శ్రీనివాస్, దొంగల శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.