ఉపాధి హామీ పథకంలోని పనులు సకాలంలో పూర్తిచేయాలి

Published: Saturday May 29, 2021
సారంగాపూర్, మే 28 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పథకంలో జరిగేటువంటి పనులు సకాలంలో పూర్తి చేయాలని సారంగాపూర్ స్పెషల్ అధికారి బాలే శివాజీ గ్రామ కార్యదర్శులకు సూచించారు. ఎక్కువ మంది కూలీలకు పని కల్పించడం నర్సరీలలో పెంచే మొక్కలు వచ్చే హరితహారంకు సిద్ధంగా ఉంచలని వైకుంఠ ధామాలు వంద శాతం పూర్తి చేయాలని పూర్తయిన కంపోస్ట్ షెడ్డులలో చెత్త సేకరించి ఎరువుగా మార్చడం మరియు స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్ల నిర్మాణం పలు అంశాలపై పంచాయతీ కార్యదర్శులకి రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ పుల్లయ్య ఎంపీవో శశికుమార్ రెడ్డి ఏపీవో రాజేందర్ చిరంజీవి ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.