తెలుగు ప్రతిభ పరీక్షలో జిల్లా ప్రథమ బహుమతి సదించిన స్లేట్ హైస్కూల్

Published: Thursday November 24, 2022
జన్నారం, నవంబర్ 23, ప్రజాపాలన: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సంస్కృతి వారు 2022-2023 సంవత్సరానికి నిర్వహించిన తెలుగు పతిభ పరీక్షలో జన్నారం మండలంలోని స్లేట్ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి  నారెందుల శ్రినిధ్ కు మంచిర్యాల జిల్లా ప్రథమ బహుమతి సాధించారని బుధవారం స్లేట్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల ప్రథమ స్థానం (బహుమతి) సాధించిన శ్రీనిధి కు ఆదివారం హైదరాబాదులో సముద్రాల వేణుగోపాలచారి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి న్యూ ఢిల్లీ మరియు కొలేటి దామోదర చేర్మెన్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారి చేతులమీదుగా స్లేట్ హైస్కూల్ జన్నారం విద్యార్థి శ్రీనిద్ మంచిర్యాల జిల్లా ప్రథమ భాహుమతి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా మొదటి భహుమతి సాధించిన విద్యార్థికి స్లేట్ హైస్కూల్ విద్యార్థి శ్రీనిద్ ను ఏనుగు సుభాష్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ జోభిన్, ఉపాద్యాయులు కమలాకర్, కృష్ణ, స్వరూపరాణి, దిలీప్, అభినందించారు.