ప్రభుత్వ ఆసుపత్రికి 7 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల అందజేత

Published: Friday June 04, 2021

ఆసిఫాబాద్ జిల్లా, జూన్ 03, ప్రజా పాలన ప్రతినిధి : కేబి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వై వి ఎస్ సురేంద్ర చేతుల మీదుగా గురువారం షార్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్, మరియు రైతు స్వరాజ్య వేదిక వారు 7 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ లను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వై వి ఎస్ సురేంద్ర జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా పరిస్థితులలో జిల్లా వైద్యశాలకు ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన 7 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల ను అందించడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రస్తుత సమయాలలో చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదవారికి ఈ ఆక్సిజన్ కాన్సెoట్రేడర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమములో ఆసిఫాబాద్ డివిజన్ పోలీస్ అధికారి, ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, టౌన్ సిఐ ఆకుల అశోక్ కుమార్, ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ స్వామి, తిర్యాని ఎస్సై రామారావు, లు పాల్గొన్నారు.