శారద ప్రవేట్ ఐ టీ ఐ కాలేజీ శిథిల వ్యవస్థ... పట్టించుకోని యాజ మాన్యం

Published: Wednesday September 29, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ఐ టి ఐ విద్యార్థులు ప్రాణభయంతో భయాందోళనతో కాలేజీ కి వెళ్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోనీ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్ మండల కార్యాలయానికి అతి దగ్గరలో నున్న శివాజీ చౌక్ సమీపంలోని సాయి నగర్ లో శారద ఐ.టి.ఐ ప్రైవేట్ కాలేజీలో వర్షపు నీటితో నిండి మోకాలి ఎత్తులో నీరు నిలిచిన యజమాన్యం ఇప్పటికీ రెండు ఏడాదిలలైన పట్టించుకునే వారే కరువయ్యారని విద్యార్థులు వాపోతున్నారు. బిల్డింగ్శిథిలావస్థలో ఉందిని ఈ కాలేజీ యాజమాన్యంని అడిగిన విద్యార్థులు.. కాలేజీ యజమాన్యం బిల్డింగ్ ఓనర్ మీద నెట్టేస్తున్నారని, విద్యార్థుల దగ్గర డబ్బులకు కక్కుర్తిపడిన కాలేజీ కరస్పాండెంట్, శారద ప్రైవేట్ ఐటిఐ యజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ఎంత వరకు సమంజసమని విద్యార్థులు అడుగుతున్నారు. కాలేజీ వెనుకభాగం మొత్తం నిండి ఉంది. బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతు కాలేజ్ నిర్వహిస్తున్న సిబ్బందిని, కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఇలాంటి బిల్డింగ్  పై చట్టపరంగా చర్య తీసుకొని విద్యార్థుల ప్రాణాలు రక్షించవలసిందిగా విద్యార్థులు కోరుతున్నారు.