తుంగూర్ లో శివసాయి హాస్పిటల్ ప్రారంభం

Published: Wednesday September 29, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామంలో సోమవారం రోజున శివసాయి హాస్పిటల్ ను ప్రారంభించారు. జన్నారం మరియు బీరుపూర్ మండలాల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విందంగా హాస్పిటల్ ను ఏర్పాటు చేసినట్లు యాజమాన్య నిర్వహకులు మల్లేశం తెలిపారు. డా:స్రవంతి కుమారి 24 గంటల్ అందుబాటులో ఉంటారని గుండెజబ్బు థైరాయిడ్ డెంగ్యూ జ్వరం ఫిట్స్ విషం షుగర్ పాముకాటు తదితర ఎమర్జెన్సీ కేసులకు వైద్యం చేయబడునని డా:స్రవంతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు స్థానిక సర్పంచ్ గుడిసె శ్రీమతి జితేందర్ ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరి ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు వివిధ గ్రామాల సర్పంచులు గర్షకుర్తి శిల్ప నల్ల మహిపాల్ రెడ్డి రిక్కల ప్రభాకర్ ఏసుదాసు అజ్మీర ప్రభాకర్ పర్వతం రమేష్ బోడ స్వప్న చిక్రం సుగుణ ఎలగందుల లక్ష్మీ చుంచు శారద బందెల మరియా సిపతి రమేష్ రంగు లక్ష్మణ్ పొల్సాని నవీన్ తదితరులు హాజరయ్యారు.