బాసర ఐఐఐటి విద్యార్థుల పోరు తెలంగాణ బిడ్డల చైతన్యానికి తల మానికం

Published: Friday June 17, 2022
టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు
 
కరీంనగర్ జూన్ 16 ప్రజాపాలన ప్రతినిధి :
"బాసర, త్రిబుల్ ఐటీ ఐఐఐటి బాసర విద్యార్థులు మంగళవారం నిండు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా.. తమ సమస్యల సాధన కోసం
8 వేల 500 మంది విద్యార్థులు మొక్కవోని ధైర్యంతో  ధర్నా చేయడం మన తెలంగాణ బిడ్డల పోరాట పటిమకు నిదర్శనమని, టి. పి. టి. ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు అన్నారు. మండల శాఖ అధ్యక్షులు యామ తిరుపతి అధ్యక్షతన  మండల కమిటీ అత్యవసర సమావేశం లో పాల్గొన్న  రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు మాట్లాడుతూ...
"దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ స్థానాన్ని పొంది తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించిన "రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం త్రిబుల్ ఐటీ ,బాసర  నుండి,  ఫైనలియర్ విద్యార్థులు 70 శాతం మంచి ప్లేస్మెంట్ పొంది,
15వందల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళుతున్నారన్నారు.అంత గొప్ప పేరు గడించిన  యూనివర్సిటీలో కనీస సౌకర్యాల కోసం ఫుల్ టైం ప్రొఫెసర్ కోసం, ప్రభుత్వం తీర్చాల్సిన కనీస సౌకర్యాల కోసం విద్యార్థులు రొడ్డేక్కడం అనేది ప్రభుత్వం చెప్పుకునే బంగారు తెలంగాణ కే అవమాన కరమని ఆయన ఎద్దేవా తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులు అనే పేరే ఉండదని నమ్మబలికి తెలంగాణ వచ్చాక మొత్తం కాంటాక్ట్ పద్ధతిలోనే సిబ్బందిని నియమించడం విచారకరం" అన్నారు . పసి హృదయాల పోరు ఉదృతం కాక ముందే వారి న్యాయమైన డిమాండ్స్ పై ప్రభుత్వం స్పందించి  పరిష్కరించాలన్నారు. వారి న్యాయమైన పోరాటానికి  టిపిటిఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. 
ఈ సమావేశంలో టీపిటిఎఫ్ మండల అధ్యక్షులు యామ తిరుపతి,  మండల ప్రధాన కార్యదర్శి నూనె కిరణ్,టిపిటిఎఎఫ్ సీనియర్ నాయకుడు నీలవేని రామస్వామి, కోట రామస్వామి మహేష్, పల్లవి, మొదలగు వారు పాల్గొన్నారు.