MLA అనుచరులు దాడులు చేశాడని ఆరోపణలు మానుకోవాలి.

Published: Tuesday March 08, 2022
టిఆర్ఎస్ పార్టీ సత్తు వెంకట రమణ రెడ్డి మీడియా ముందు వెల్లడి
ఇబ్రహీంపట్నం మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తుంటే అభివృద్ధి చూసి ఓర్వ లేక విమర్శలు చేస్తున్నారు రోడ్ల అభివృద్ధి కోసం ఇండ్లు కూల్చడం చట్టబద్దత తోనే జరుగుతుంది. నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారంగా 120 గజాల స్థలంతో పాటు 3లక్షల రూపాయలు ఇవ్వడానికి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు చట్టానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి గొడవ పడడమే కాకుండా లాయర్ పేరును వాడుకొని దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. గత 13 ఏండ్లు గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజల మన్ననలను పొందింన ఎమ్మెల్యే ఆది జీర్ణించుకోలేక విమర్శలు చేయడం సిగ్గు చేటు 6 నెలకు ఒక్కసారిగా వచ్చే మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోకుండా 'వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం సరైన పద్ధతి కాదని విమర్శించారు అభివృద్ధికి సహకరించేది పోయి విమర్శలు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం ఆయన అన్నారు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీద విమర్శించడం సరికాదని ఆయన తెలిపారు