పోలీసు నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి

Published: Monday September 05, 2022
చిప్పకుర్తి శ్రీనివాస్  
 టి వి యు వి రాష్ట్ర కార్యదర్శి
 
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 04, ప్రజాపాలన:   పోలీసు నియామకాల్లో  రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదివారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.  
ఈ సందర్భంగా టి వి యు వి  రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, దాని ఫలితంగా అనగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బి సి అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కి విరుద్ధంగా, ఎస్సీ ఎస్టీ లకు నిర్దేశించిన ఆర్టికల్స్ 341, 342 లకు వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్ ఉందని, అన్ని వర్గాల అభ్యర్థులకు ఒకే విధంగా 60 శాతం  మార్కుల రూల్ పెట్టడం అన్యాయమని,   
రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి జరుగుతున్న అర్హత పరీక్షల్లో రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారని దీనివల్ల ఎస్సి,ఎస్టి,బీసి నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, 
డిమాండ్ చేశారు.లేని యెడల నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, రవితేజ, వినోద్, ప్రసాద్, మల్లేష్ రాజకుమార్  విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు.
 
 
 
Attachments area