ఘనంగా బీజేపీ నాయకుడు రేవు నరసింహ జన్మదిన వేడుకలు

Published: Wednesday May 05, 2021
మేడిపల్లి, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : బీజేపీ సీనియర్ నాయకులు, రామంతాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షులు రేవు నరసింహ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు రేవు నరసింహను శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సంకూరి కుమారస్వామి, వులుగొండ నారాయణ దాస్, కేశవ రెడ్డి, ఇళ్ళిట్టం నరసింహారెడ్డి, సంతోష్ గుప్తా, మామిళ్ల సుధాకర్ యాదవ్, శైలేందర్, కల్మ కళ్ళ లింగం, వీణ, ప్రభాకర్ రెడ్డి, సురేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.