చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం అవసరం

Published: Thursday November 11, 2021
ఫిక్కీ ప్రెసిడెంట్ చిగురుపాటి ఉమ
వికారాబాద్ బ్యూరో 10 నవంబర్ ప్రజాపాలన : విద్యార్థినులకు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం అవసరమని ఫిక్కీ ప్రెసిడెంట్ చిగురుపాటి ఉమ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిక్కీ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో వికారాబాద్ లోని విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ పై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాాట్లాడుతూ యోగా, మెడిటేషన్, పర్సనల్ హైజీని, వ్యక్తిత్వ వికాస పాఠాలను ఆయా రంగాల్లో నిపుణులైన వారిచే థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహించారు. మారుమూల తండా నుండి పట్నం దాకా మహిళల్లో సాధికారత కోసం ఫిక్కీ సంస్థ పనిచేస్తుందన్నారు. ఆడపిల్లలు లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిదని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత బాలికలకు విద్యతో పాటుగా సెల్ఫ్ కానిపిడెన్స్ పెంచే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మా ఫిక్కీ మెంబర్, చేవెళ్ల ఎంపీ సతీమణి సీతా రంజీత్ రెడ్డి సహకారంతో వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఆన్ లైన్ లో నిర్వహించిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లకు విద్యార్థనులు, వారి తల్లిదండ్రుల నుండి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. విద్యార్థినులకు జామెట్రి కంపాక్స్ బాక్స్ లను, నోట్ బుక్స్ లను ఉచితంగా అందజేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పాఠశాలలు తెరవక పోవడంతో ఆన్ లైన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఇప్పుడు అప్ లైన్ లో స్కిల్ డెవెలప్ మెంట్, మోటివేషనల్ తరగతులు చేపట్టడానికి తమ పాఠశాలను ఎంపీక చేసుకోవడం పట్ల విద్యార్థినులు వారి తల్లిదండ్రులు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సభ్యులు స్మితా గూడ, అర్షియా అఫ్సర్, ప్రశాంతి శేఖర్, డాక్టర్ పశీయా, రాధా, వికారాబాద్ ఎంఈఓ బాబు సింగ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత, శ్రీలత, మిగతా టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.