సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లకి వినతి పత్రం అందజేశారు

Published: Tuesday February 15, 2022

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : తట్టి అన్నారం గ్రామ సర్వే నెంబర్ 127/2, 127/3 ప్రభుత్వ భూమినీ సర్వే చేసి కబ్జాదారుల నుంచి రక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ నరసింహ మాట్లాడుతూ, గత సంవత్సర కాలం నుండి, ఇట్టి భూమి రక్షించాలని కలెక్టరు ఆర్ డి ఓ గారికి, విన్నవించి అనేక దఫాలుగా ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పటికీ. అధికారులు ప్రజా ప్రతినిధులు కబ్జాదారులతో కుమ్మక్కై కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆ భూమిలో ఉన్న పట్టాదారులు, రెండు ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం, సర్వే చేయకుండా ప్రభుత్వ భూమిని బయటకు తీయకుండా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు గ్రామ ప్రజలందరూ తక్షణమే సర్వే చేస్తామని చెప్పేంతవరకు ఇక్కడ నుండి కదిలేది లేదని ధర్నాకు కూర్చోవడంతో రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే రాస్తున్నామని హామీ ఇవ్వడంతో ఎమ్మార్వో గారికి మెమోరాండం ఇచ్చి ధర్నా విరమించడం జరిగింది. వారం రోజుల్లో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని తీయకపోతే తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉదృతమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అన్న ప్రభాకర్ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శివ కుమార్ . మునిందర్ రెడ్డి, సర్వయ్య, సుధాకర్, అరుణ్, మల్లయ్య, ప్రమీల, సువర్ణ పద్మ అనేక మంది పాల్గొన్నారు