మండల పరిషత్ కార్యాలయంలో ఉత్సహాభరితంగా బతుకమ్మ సంబరాలు

Published: Tuesday October 04, 2022

బోనకల్, అక్టోబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి: స్థానిక బోనకల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 9వ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు మండల అధికారుల సమక్షంలో ఉత్సాహభరితంగా కొనసాగాయి. పలు రకాల ఆట పాటలతో అధికారులు బతుకమ్మ, కోలాటాలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం,ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, ఎస్సై తేజావత్ కవిత, ఎంపీఓ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, వైస్ ఎంపీపీ గుగులోత్ రమేశ్,కో ఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దిన్,ఆర్ఐ గూగులోత్ లక్ష్మణ్,ఏపీఓ బసవోజు కృష్ణకుమారి,ఎపీఎం యద్దనపుడి పద్మాలత,ఏసీడిపీఓ కమలప్రియ, వివిధ గ్రామ పంచాయితీల కార్యదర్శులు,అంగన్వాడి టీచర్లు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.